‘ఆదిత్యనాథ్ను అంతం చేస్తా’

‘ఆదిత్యనాథ్ను అంతం చేస్తా’

లక్నో: ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను హతం చేస్తామని అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ లో బెదిరించాడు. ‘ఆదిత్యనాథ్కు మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయ’ని ఉత్తరప్రదేశ్ పోలీస్ వాట్సాప్ ఎమర్జెన్సీ డయిల్ నెంబర్ 112 కు బెదరింపు సమాచారం వచ్చింది. దీనిపై సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేశారు. ఏ నెంబర్ నుంచి ఫోల్ కాల్ వచ్చిందో గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నిఘా బృందమూ రంగంలోకి దిగింది. యోగి ఆదిత్యనాథ్ను చంపు తామంటూ బెదరింపు కాల్స్ రావడం ఇదే తొలి సారి కాదు. నిరుడు సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్లోనూ వచ్చాయి. నవంబర్లో 15 ఏళ్ల కుర్రాడు ఆ సందేశాన్ని పంపాడు. మొబైల్ నెంబర్ ఆధారంగా అతన్ని ఆగ్రాలో అరెస్టు చేసి జ్యువనైల్ హోమ్కు పంపారు. కరోనా వల్ల బడులు మూసేయడంతో ఆ బాలుడు కోపంతో బెద రింపు మెసేజ్ పంపినట్లు తెలిసింది. 2017 నుంచి ఆదిత్యనాథ్కు జడ్ ప్లస్ వీవీఐపీ సాయుధ బలగాల రక్షణ ఇచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos