లక్నో: ఆక్సిజన్ కోరుతూ ట్వీట్ చేసినా శశాంక్ యాదవ్ అనే వ్యక్తిని అసత్యాలు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణపై పోలీసులు అరెస్టు చేసారు. నగర వాసి శశాంక్ యాదవ్ అనే వ్యక్తి తన తాత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నందున ఆక్సిజన్ సిలిండర్ అత్యవసరం అంటూ ట్వీట్ చేసాడు. దాన్ని సోనూ సూద్ కూ ట్యాగ్ చేసాడు. శశాంక్ స్నేహితుడు అంకిత్ దీన్ని ఒక విలేఖరికి పంపి సాయం చేయాలని అభ్యర్థించాడు. ఆ విలేఖరి ఈ మెసేజ్ను షేర్ చేసాడు. స్మృతి ఇరానీకీ ట్యాగ్ చేశారు. ఈ మెసేజ్లలో ఎక్కడా కూడా శశాంక్ తాత కోవిడ్తో బాధపడుతన్నట్లు వెల్లడించ లేదు. స్మృతి ఇరానీ, శశాంక్కు సాయం చేద్దామని భావించి అతడికి మూడు సార్లు ఫోన్ చేసినా స్పందన లేక పోయింది. దీంతో ఆమె ఆ సందేశాన్ని అమేథీ జిల్లా మెజిస్ట్రేట్, పోలీసు ఉన్నతాధికారికి పంపారు. ‘శశాంక్ తన ట్వీట్లో షేర్ చేసిన నంబర్కు మూడు సార్లు కాల్ చేశాను. ఎలాంటి బదులూ లేదు. దాంతో అమేథీ జిల్లా ధికారి, పోలీసులకు అతడి గురించి కనుక్కోని సాయం చేయాల్సిందిగా కోరాన’ని స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు.