కప్పన్ను ఢిల్లీ ఆస్పత్రికి తరలించండి

కప్పన్ను ఢిల్లీ ఆస్పత్రికి తరలించండి

న్యూ ఢిల్లీ : హథ్రాస్ అత్యాచార కేసులో అక్రమంగా అరెస్టైన కేరళ జర్నలిస్ట్ సిద్ధిఖీ కప్పన్ను మెరుగైన చికిత్స నిమ్తితం ఢిల్లీకి తరలించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు బుధవారం ఆదేశించింది. చేసింది. ఎయిమ్స్ లేక ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆసుపత్రుల్లో చేర్చాలని ఆదేశించింది. కోలుకున్న తర్వాత ఆయనను మధుర జైలుకు తరలించే అవకాశాలున్నాయి. సిద్ధిఖీ కప్పన్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసి ఇటీవల ఆయన భార్య రైహంత్ కప్పన్ సుప్రీం కోర్టు ప్రధాన నాయ మూర్తి ఎన్వి రమణకు లేఖ రాసారు. తన భర్తకు ఇటీవల కరోనా సోకిందని, పరిస్థితి విషమంగా ఉందని, మధుర మెడికల్ కాలేజీలో ఆసుపత్రిలో ఒక మంచంపై జంతువును కట్టేసినట్లు కట్టేశారని లేఖలో పేర్కొన్నారు. ఆయన ప్రాణానికి ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కప్పన్ను ఢిల్లీ ఎయిమ్స్ తరలించాలని కోరుతూ కేరళ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్సు కూడా ఈ నెల 20న సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. హథ్రాస్లో అగ్ర కులానికి చెందిన యువకుల చేతిలో నరకయాతనకు గురైన దళిత యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనను రిపోర్టు చేసేందుకు వెళ్తున్న ఆయన్ను గత ఏడాది అక్టోబర్లో పోలీసులు అదుపులోకి తీసుకొని యుఎపిఎ చట్టం కింద కేసు నమోదు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos