న్యూ ఢిల్లీ: కరోనా నివారణకు నోటి ద్వారా తీసుకునే ఔషధాన్ని విడుదల చేస్తామని ఫైజర్ ముఖ్య కార్యానిర్వహాధికారి ఆల్బర్ట్ బౌర్లా ప్రకటించారు. ‘ప్రస్తుతం రెండు యాంటీ వైరల్ ఔషధాల పై పరిశోధనలు చేస్తున్నాం. అందులో ఒకటి నోటి ద్వారా తీసుకునే ద్రవ ఔషధం. ఇంకొకటి సూది మందు. ప్రస్తుత ప్రాధాన్యాల దృష్ట్యా ద్రవ ఔషధంపైనే ఎక్కువగా పని చేస్తున్నాం. ద్రవ మందులకు ఆసుపత్రికి దాకా పోవాల్సిన అవసరం లేదు. ఇదే వేగంతో పరిశోధనలు జరిగితే వచ్చే డిసెంబరుకు మందు సిద్ధమవుతుంది. వచ్చే జనవరికి వినియోగ దార్లకు అందుబాటులోకి వస్తుంద’ని వెల్లడించారు. ‘ఎన్ని రకాల కరోనా వచ్చినా దాని పీచమణిచే మందుల తయారీనే లక్ష్యం. ప్రస్తుతమున్న యాంటీ వైరల్ ఔషధాలు కరోనా వైరస్ లోని స్పైక్ ప్రొటీన్ పై పని చేయడం లేదు. కాబట్టి ఎస్ ప్రొటీన్వర్తనలనే లక్ష్యంగా చేసుకునే ఔషధాన్ని తయారు చేస్తు న్నాం. వచ్చే నెల్లో మరిన్ని వివరాలను వెల్లడిస్తామ’న్నారు.