న్యూ ఢిల్లీ: కరోనా టీకాల ఉత్పత్తిని పెంచేందుకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ సంస్థలకు రూ. 4వేల 500కోట్ల రుణం మంజూరుకు కేంద్ర ఆర్థిక మంత్రి త్వ శాఖ ఆమోదం తెలిపింది. సీరంకు రూ. 3వేల కోట్లు, భారత్ బయోటెక్‌కు రూ. 1500 కోట్లు రుణాలు మంజూరయ్యాయి. త్వరలోనే నిధులు విడుదలవుతాయని ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. టీకా ఉత్పత్తిని నెలకు పది కోట్లకుపైగా డోసులు పెంచేందుకుగాను రూ. 3 వేల కోట్లు ఆర్థిక సాయం చేయాలని సీరం సీఈఓ అదర్ పూనా వాలా విజ్ఞప్తి చేసారు.