హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిని ఏప్రిల్ 17 నుంచి పూర్తి స్థాయి కోవిడ్ ఆస్పత్రిగా మార్చుతున్నట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అలాగే గాంధీ ఆస్పత్రిలో శనివారం నుంచి ఓపీని నిలిపివేయాలని, ఎమర్జెన్సీ సేవలు కూడా ఆపివేయాలని ఆదేశించింది. కాగా ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో 450 మందికి పైగా కరోనా పేషెంట్స్ ఉండగా.. నిన్న ఒక్కరోజే కొత్తగా 150 మంది కోవిడ్ పేషెంట్లు జాయిన్ అయ్యారు. ప్రతి పది నిమిషాలకు ఒకరు కరోనాతో గాంధీలో చేరుతున్నారు. దీంతో కరోనా బాధితులతో ఐపీ బ్లాక్ అంతా నిండిపోయింది. ఈ నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిని రేపటి నుంచి పూర్తి స్థాయి కోవిడ్ ఆస్పత్రిగా మార్చేందుకు ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. కరోనా రోగులు పెరుగుతుండటంతో నాన్ కోవిడ్ డిపార్ట్‌మెంట్లను వైద్యులు ఖాళీ చేయిస్తున్నారు.