హైదరాబాద్ : జనసేన అధ్యక్షుడు, నటుడు పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడ్డారు. తిరుపతి లోక్‌సభ స్థానం ఉప ఎన్నికను పురస్కరించుకుని ఈ నెల 3న ఆయన ప్రచారం నిర్వహించారు. తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్న ఆయనకు నలతగా ఉండడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. కరోనా సోకలేదని అప్పట్లో నిర్ధారణ అయినప్పటికీ, ఆయన తన వ్యవసాయ క్షేత్రంలో స్వీయ క్వారంటైన్‌లో ఉంటున్నారు. రెండు రోజులుగా కొద్దిపాటి జ్వరంతో పాటు ఒళ్లు నొప్పులు ఉండడంతో తిరిగి పరీక్షలు నిర్వహించినప్పుడు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైద్యులు ఆయనకు చికిత్సలు ప్రారంభించారని, ఊపిరితిత్తుల్లో కొద్దిగా నెమ్ము చేరడంతో యాంటీవైరల్ మందులతో చికిత్సలు చేస్తున్నారని జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.