న్యూ ఢిల్లీ: భారత్లో 75 శాతం వర్షపాతానికి కారణమయ్యే నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది సాధారణ వర్షపాతాన్ని నమోదు చేస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శుక్రవారం అంచనా వేసింది. వానాకాలంలో వర్షపాత దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ) 98 శాతానికి దగ్గరగా ఉంటుంది. వర్షకాలంలో ఎల్పీఏ.. 96 నుంచి 104 శాతంగా ఉంటే దాని ని సాధారణ వర్షపాతంగా గుర్తిస్తారు. ఇది దేశానికి శుభవార్త అని, ఈ సారి వ్యవసాయ దిగుబడి సానుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు.