న్యూ ఢిల్లీ: 14వ ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేవ్కు ప్రత్యేక హోదా ఇవ్వజాలమని కేంద్రప్రభుత్వం మరోమారు తేల్చి చెప్పింది. పునర్విభజన చట్ట అమలు గురించి తెదేపా సభ్యుడు రామ్మోహన్నాయుడు లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్రాయ్ ఈ మేరకు లిఖిత పూర్వక సమాధా నమి చ్చారు. ‘పునర్విభజన చట్టంలోని అనేక అంశాలు అమల్లో ఉన్నాయి. ఇంకొన్ని హామీలు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రాజెక్టులు, విద్యాసంస్థల నిర్మాణం సుదీర్ఘకాలం పట్టే అంశాలు. రెండు రాష్ట్రాల అధికారులతో 24 సమీక్ష సమావేశాలు జరిగాయ’ని వివరించారు.