తిరువనంతపురం : పెట్రోలు ధరలను పెంపు పై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంపై విరుచుకు పడ్డారు. శాసనభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడి ఒక కళాశాల విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ‘ పెట్రో ధరలు పెంచి, ప్రజల జేబుల్లోంచి బలవంతంగా డబ్బులు లాక్కుంటున్నారు. ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా గాడి తప్పడానికి కేంద్రం అవలంబిస్తున్న ధోరణులే కారణం. పరిస్థితిని మార్చేందుకు ప్రజల చేతికి అధిక మొత్తంలో సొమ్మును బదిలీ చేయడమే ఏకైక మార్గం. ప్రజలకు భారీ మొత్తంలో సొమ్మును బదిలీ చేస్తే ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుంది. వినియోగాన్ని ప్రారంభించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించవచ్చని నమ్ము తున్నాం. ప్రజల చేతికి డబ్బులిస్తే కొనడం, అమ్మడం ప్రారంభమవుతుంది. జీఎస్టీ, నోట్లరద్దు ద్వారానే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఇక కరోనా దానికి తోడైంది. ఆర్థిక వ్యవ స్థ కుప్పకూలింది. ప్రస్తుతానికి ఆర్థిక వ్యవస్థ పట్టాలెక్కలేదు. ప్రభుత్వం వద్ద సొమ్ము లేదన్నారు. దీంతో ట్యాక్సులు రావడం లేదు. దీంతో పెట్రో ధరలు పెంచి, బలవంతంగా ప్రజల నుంచి లాక్కొంటున్నార’ని విమర్శించారు.