భాజపా ఉచిత రేషన్​ హామీ.. ఓ పెద్ద అబద్ధం

కొతుల్పుర్ : ఉచితంగా ఆహార పదార్థాల్ని అందిస్తామని భాజపా చేసిన ఎన్నికల హామీ పెద్ద బూటక మని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. ఆ హామీని భాజపా ఎన్నటికీ నెరవేర్చలేదని అన్నారు. సోమవారం ఇక్కడ జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. ‘భాజపా.. బయటి వ్యక్తుల పార్టీ’ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉగ్రవాదాన్ని సృష్టించేందుకు ఆ పార్టీ గూండాలను తయారు చేస్తోందని ఆరోపించారు. ‘ ఉచిత రేషన్ ఇస్తామంటూ భాజపా తప్పుడు హామీలు ఇస్తోంది. దాన్ని భాజపా ఎన్నటికీ నెరవేర్చదు. మిమ్మల్ని ఓటు వేయాలని అడిగేందుకు భాజపా రౌడీలు మీ ఇంటికి వస్తారు. వాళ్లు మిమ్మల్ని భయపెడితే.. ఇంట్లో ఉన్న పాత్రలను పట్టుకుని, వాళ్లను తరిమిగొట్టేందుకు సిద్ధంగా ఉండండి. మహిళలు ఏం తినాలో, ఏ బట్టలు వేసుకోవాలో భాజపా ఆదేశాలిస్తోంది. అంబేద్కర్ కంటే నరేంద్ర మోదీనే గొప్ప వ్యక్తి అని భావించేలా ప్రజల ఆలోచనను మారుస్తున్నారు. గుజరాత్లోని ఓ స్టేడియం పేరును మోదీ స్టేడియంగా మార్చారు. ఏదో ఓ రోజు ఈ దేశం పేరును కూడా వాళ్లు మారుస్తారు. ప్రభుత్వం రంగ సంస్థలను ప్రైవేట్పరం చేస్తున్నార’ని ధ్వజమెత్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos