గోలాఘాట్ : అసోం ప్రజలను భాజపా నయవంచన చేసిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ధ్వజమెత్తారు. నగరంలో సోమవారం జరిగిన ఎన్ని కల ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. ‘భాజపా మాఫియాలా తయారైంది. సిండికేట్లు నడుపుతోంది. అసోం యువతను, టీ తెగలను భాజపా ఫ్యాక్షన్ నేతలు దగా చేశారు. పౌర చట్టం తెచ్చారు. విమానాశ్రయాన్ని వారి సంపన్న మిత్రులకు అమ్మేశారు. ఓఎన్జీసీని కూడా ప్రైవేటుపరం చేయాలని కుట్ర పన్నుతున్నారు. నాగావ్‌లో ప్రజల నుంచి భూ ములు లాక్కొని భాజపా దాని స్నేహితులకు కట్టబెట్టింది. దాంతో రైతులు ఆందోళనలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింద’ని వివరించారు.