ముంబై: మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబయి మాజీ పోలీసు కమిషనరు పరమ్‌బీర్ సింగ్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘మాజీ కమిషనర్ లేఖను పరిశీలిస్తే.. ఫిబ్రవరి మధ్యలో పలువురు అధికారులు తమకు హోం మంత్రి ఆ ఆదేశాలు ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఫిబ్రవరి 6 నుంచి 16వ తేదీ వరకు దేశ్ముక్ కరోనా బారినపడి ఆసుపత్రిలో చేరారు. ఆరోపణలు చేసిన సమయంలో హోం మంత్రి ఆసుపత్రిలో ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఆరోపణలకు ఎలాంటి బలం లేదు. అవి నిరాధారమైనవని తేలింది’అని శరద్ పవార్ విపులీకరించారు.