20మందిని కనండి

20మందిని కనండి

డెహ్రాడూన్: కష్టపడుతున్న పేద కుటుంబాలకు ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు పంపిణీ చేసే కేంద్ర ప్రభుత్వ పథకం నుండి ఎక్కువ లబ్ది పొందాలంటే 20 మంది పిల్లల్ని కనాలని ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ సూచించారు. రామ్ నగర్లో సోమవారం జరిగిన అటవీ దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. ‘ఇద్దరు పిల్లలున్న మీరెందుకు అసూయపడతారు.. ఇరవైమందిని ఎందుకు కనలేదం’టూ వ్యాఖ్యానించారు. ‘కరోనా వల్ల గతంలో ఎన్నడూ లేనంతగా నాణ్యమైన రేషన్ సరుకులను పేదవారికి కేంద్రం అందిస్తోంది మనిషికి ఐదు కేజీల చొప్పున సరుకులు లభిస్తున్నాయి. ఇద్దరు పిల్లలతో, నలుగురు సభ్యులున్న కుటుంబానికి 20 కేజీల సరుకులు దక్కుతుండగా, 20 మంది సభ్యులున్న కుటుంబానికి ఏకంగా క్వింటాల్ సరుకులు లభిస్తున్నాయన్నారు. దీంతో ఎక్కువ సరుకులు పొందుతోన్న వారిపై చిన్నకుటుంబాల వాళ్లు అసూయతో రగిలిపోతున్నారు. మీకు అసూయ..ఇద్దరు పిల్లల్నే కని ఆపేయడం ఎందుకు, 20 మంది పిల్లల్ని ఎందుకు కనలేదంటూ ’వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos