కాలిపోతారు జాగ్రత్త

కాలిపోతారు జాగ్రత్త

ముంబై: కేంద్ర ఏజెన్సీ ల్ని దుర్వినియోగంచేసి మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తే చెలరేగే రోషాగ్నికి కేంద్రం మాడి మసై పోతుందని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ హెచ్చరించారు. గత కొద్ది రోజులుగా మహా మంత్రులపై వరుసగా తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ఒక మంత్రిపై లైంగిక ఆరోపణల కేసు సంచలనం సృష్టించగా, మరో మంత్రిపై హత్యా కేసు రాష్ట్రాన్ని కుదిపివేసింది. తాజాగా హోమంత్రిపై అవినీతి ఆరోపణలు మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వం ప్రమాదంలో పడింది. దీన్ని అవకాశంగా తీసుకుని భారతీయ జనతా పార్టీ.. మహారాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు చేస్తోంది. ఈ తరుణంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారనే వార్తలు గుప్పుమంటున్నాయి. దీనిపై సోమవారం సంజయ్ రౌత్ తీవ్రంగా స్పందించారు. ‘కేంద్ర సంస్థల్ని తప్పుదారిలో వినియోగించుకుంటూ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రం చూస్తున్నట్లయితే నేను మీకో హెచ్చరిక పంపుతున్నాను. ఇక్కడ రాష్ట్రపతి పాలన విధిస్తే రేగే మంటల్లో మీరే కాలిపోతారు’’ అని అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos