న్యూ ఢిల్లీ: మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీర్థ సింగ్ రావత్ కు భాజపా అధిష్ఠానం సంజాయిషీ తాఖీదుల్ని జారీ చేసింది. త్వరలో ఢిల్లీ వెళ్లి వివరణ ఇవ్వనున్నారు. గత 10 న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణాన్ని చేసారు. ‘నేను కొద్దిరోజుల కిందట విమానంలో ప్రయాణించినపుడు నాన పక్కన కూర్చొన్న ఓ మహిళ చిరిగిన జీన్స్ ధరించింది. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. ఇలాంటి వస్త్రధారణతో సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తార’ని ఆయన ఒక సమావేశంలో వ్యాఖ్యానించారు. దీనికి వ్యతిరేకంగా చిరిగిన జీన్స్ ధరించిన పోస్టులు కూడా పెడుతూ కొందరు నిరసన వ్యక్తం చేస్తున్నారు.