చెన్నై: పార్లమెంటులో పౌరసత్వ చట్టానికి(సీఏఏ) అనుకూలంగా ఓటేసిన అన్నాడీఎంకే ఇప్పుడు ఎన్నికల ప్రణాళికలో సీఏఏ అమలును నిలిపివేసేలా కేంద్రాన్ని ఒప్పి స్తామని హామీ ఇచ్చింది. ఇంకా శ్రీలంకలోని తమిళులు, ప్రవాస తమిళుల కోసం ప్రత్యేక తమిళ ఈలం ఏర్పాటుకు డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ఉమ్మడి సమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి భాజపాతో పొత్తు ఎన్నికల వరకే పరిమితమని, సైద్ధాంతికంగా కాదని ఇటీవలే స్పష్టం చేశారు. సిఏఏ పై అధికార పార్టీ వాగ్దానం భాజ పాకు చికాకు, చిక్కులు తెప్పించేదే. దీనిపై ముందుకెళ్లడం అంత సులువేం కాదు. కేంద్రాన్ని ఎలా ఒప్పిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. లంక-తమిళుల అంశాన్ని రెండు పార్టీలు మేనిఫెస్టోల్లో ప్రస్తావించాయి. శ్రీలంక శరణార్థులకు ద్వంద్వ పౌరసత్వం కల్పిస్తామని రెండు పార్టీలూ హామీ ఇచ్చాయి. తమిళ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో శ్రీ లంక ప్రభుత్వానికి పూర్తి అధికారాలు దక్కేలా తాము పోరాడతామని పేర్కొంది.