న్యూ ఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ పై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ మంగళవారం ట్వీట్ లో కేంద్రంపై ఎదురు దాడి చేశారు. ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీక రించ డమంటే.. దేశ ఆర్థిక భద్రతపై రాజీ పడటమేనని వ్యాఖ్యానించారు. ప్రైవేటీకరణ అయితే లాభం, జాతీయీకరణ అయితే నష్టమన్న ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టారు. ఆందోళన పట్టిన బ్యాంకు ఉద్యోగులకు. రాహుల్ మద్దతు ప్రకటించారు.