రాజమండ్రి: దేశాన్ని పెట్టుబడి దార్ల పాదాక్రాంతం చేయాలన్నదే భాజపా సిద్ధాంతమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. బ్యాంక్ యూనియన్ల నిర్వహిస్తున్న సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ప్రసంగించారు. ‘సమ్మెలు, ఉద్యమాల్ని మోదీ ప్రభుత్వం లెక్కచేయదు. పంజాబ్ రైతుల ఆందోళనతో ఇది తేలిపోయింది. మోదీ ప్రభుత్వంపై మేధోతనంతోనే పోరాడాలి. సోషలిస్టు దేశాన్ని క్యాపటలిస్ట్గా మార్చేస్తామని రాజ్యాంగ సవరణ చేయడంపై మోదీ ప్రభుత్వాన్ని నిలదీయాలి. అప్పుడే మోదీ ప్రభుత్వం బండారం బయటపడుతుందని అన్నారు. మోదీ ప్రధాని అయ్యేనాటికి 46 లక్షల కోట్లు ఉన్న మన దేశం అప్పు.. ఇప్పుడు కోటి 7 లక్షలకు చేరుకుందన్నారు. 1969లో ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయకరణ చేయడం వల్లే ప్రపంచ ఆర్థిక సంక్షోభంలోనే మన దేశం నిలబడిందని గుర్తుచేశారు. మోదీ ప్రభుత్వానికి పరిపాలన చేయడం సాధ్యం కాలేదన్నారు. చివరకు రక్షణ రంగంలోనూ విఫలం కావడంతో నేపాల్ కూడా మనదేశంపై కాలుదువ్వుతోందని పేర్కొన్నారు.