న్యూ ఢిల్లీ : కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగిస్తున్న రైతులు మార్చి 26న భారత్ బంద్కు పిలుపు నిచ్చారు. ఢిల్లీ సరిహద్దుల్లో అలుపెరగని పోరాటం చేస్తున్న రైతు సంఘాలు నేతలు గురువారం తదుపరి కార్యాచరణ గురించి చర్చించారు. వ్యవసాయ చట్టాలపై తాము చేస్తున్న ఆందోళన మార్చి 26 నాటికి నాలుగు నెలలు పూర్త వుతున్న నేపథ్యంలో భారత్ బంద్ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. మార్చి 26న పూర్తి స్థాయిలో భారత్ బంద్ చేపట్టనున్నట్లు రైతు నేత బూటా సింగ్ తెలి పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా శాంతియుతంగా ఈ బంద్ కొనసాగుతుందని వెల్లడించారు. అదేవిధంగా పెరిగిన ఇంధన ధరలు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 15న ట్రేడ్ యూనియన్లతో కలిసి ఆందోళనలో పాల్గొనున్నట్లు ఆయన తెలిపారు. మార్చి 29న ‘హోలీ కా దహన్’ పేరుతో వ్యవసాయ చట్టాల ప్రతులను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేయనున్నట్లు వెల్లడించారు.