రాహుల్​ గాంధీ​ కానుకతో ఆ బాలుడు ఖుష్​

రాహుల్​ గాంధీ​ కానుకతో ఆ బాలుడు ఖుష్​

న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఇచ్చిన కానుకతో ఓ బాలుడు ఆనందంలో మునిగిపోతున్నాడు. రాహుల్ ఈ నెల 1న కన్యాకుమారిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించినపుడు వెదురు తోటల్లో ఉన్న కొందరు బాలురు పలకరించిరు. రాహుల్ గాంధీ కారు నుంచి దిగి వారితో ముచ్చటించారు.ఈ సందర్భంగా ఆంథోనీ ఫెలిక్స్ అనే ఆరో తరగతి బాలుడు తనకు పరుగు పందెం పట్ల ఎక్కువ ఆసక్తి ఉన్నట్లు తెలిపాడు. అలాగే సరైన శిక్షణ ఇప్పిస్తే.. పోటీల్లో గెలవగలనని విశ్వాసంతో చెప్పాడు. బాలుడి మాటలు విన్న రాహుల్ గాంధీ కోచ్ను ఏర్పాటు చేసి, రన్నింగ్ షూస్ సైతం కొనిస్తానని హామీ ఇచ్చారు. ఆ వాగ్దానం మేరకు ఆంథోనికి బూట్ల జత కొని పంపారు. ఇవి అందుకున్న బాలుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆంథోనితో ఫోన్లో మాట్లాడిన రాహుల్.. ‘బూట్లు నచ్చాయా’ అని అడిగారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos