సర్వేలపై నమ్మకం లేదు : బీజేపీ

సర్వేలపై నమ్మకం లేదు : బీజేపీ

న్యూఢిల్లీ: మీడియా నిర్వహించే ప్రీపోల్స్ సర్వేలతో సంబంధం లేకుండా అసోం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు ఖాయమని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత జుయల్ ఓరమ్ జోస్యం చెప్పారు. సర్వేలు నిజం కానవసరం లేదని అన్నారు. బుధవారంనాడిక్కడ మీడియాతో ఓరమ్ మాట్లాడుతూ, ప్రీ పోల్ సర్వేలు, ట్రెండ్లు ఒకటి రెండు సార్లు నిజమైతే కావచ్చు కానీ, ఆలాంటి సర్వేలపై తనకు నమ్మకం లేదన్నారు. బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఇదే ప్రాంతానికి చెందినవాడిగా తాను ఈ విషయాన్ని బలంగా చెబుతున్నానని అన్నారు. ఖరగ్‌పూర్‌, మిడ్నాపూర్‌లలో వాతావరణం చూసిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమనే నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్టు ఆయన తెలిపారు.
అసోం గురించి మాట్లాడుతూ, పశ్చిమబెంగాల్‌తో పాటు అసోంలో కూడా తమ పార్టీ (బీజేపీ) బాగా కష్టపడుతోందని, రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నానని ఓరమ్ చెప్పారు. ఎన్నికల్లో తాము మీడియాపై దృష్టి సారించకుండా పనితీరుపైనే దృష్టి పెడతామని అన్నారు. కౌంటింగ్ జరిగే చివరి రోజు మాత్రమే టీవీ చూడటం, వార్తాపత్రికల్లో ఏమి రాసారనేది చూడటం జరుగుతుందని ఆయన తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos