డేహరాడూన్:ఇక్కడి రాజ్భవన్లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా తీర్థ సింగ్ రావత్ చే గవర్నర్ బేబి రాణి మౌర్య ప్రమాణాన్ని చేయించారు. అసమ్మతి కారణంగా త్రివేంద్ర సింగ్ రావత్ ముఖ్యమంత్రి పదవికి మంగళవారం రాజీనామా చేసారు. ఇక్కడి భాజపా కార్యాలయంలో ఎమ్మెల్యేలు సమావేశమై భాజపా శాసనసభా పక్ష నేతగా తీర్థ సింగ్ను ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఆయన లోక్సభలో గడ్వాల్ కు ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నారు. 2013-15 వరకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించారు. ప్రస్తుతం పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు.