కోల్కతా : ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్ విధానసభ నియోజక వర్గం నుంచి పోటీ చేసేందుకు బుధవారం ఇక్కడ నామపత్రాన్ని దాఖలు చేసారు. అంతకు ముందు ఆమె శివాలయంలో అభిషేకం, పూజలు నిర్వహించారు. తర్వాత కార్యకర్తలతో నడుచుకుంటూ వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.