న్యూఢిల్లీ : మార్చి నెలలో బ్యాంకులు 11 రోజుల పాటు పని చేయవు. బ్యాంకుల విక్రయానికి నిరసనగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఈ నెల 15 నుంచి రెండు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చాయి. మార్చి 13న రెండో శనివారం, 14న ఆదివారం. 15, 16 ల్లో సమ్మె కారణంగా బ్యాంకులు వరుసగా నాలుగు రోజుల పాటు పని చేయవు.
పండుగ సెలవులు, రెండు శనివారాలు, నాలుగు ఆదివారాలతో కలిపి మొత్తం 11 రోజులు బ్యాంకులు అందుబాటులో ఉండవు. దీంతో ఖాతాదారులు తమ ఆర్థిక లావాదేవీల కోసం మందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని బ్యాంకులు సూచించాయి. మార్చి 11న మహాశివరాత్రి, 22న బీహార్ దివన్, 30న హోలీ పండుగ సందర్భంగా సెలవు ప్రకటించారు.