న్యూ ఢిల్లీ : మార్చి 15 నుంచి సుప్రీం కోర్టులో కేసుల ముఖాముఖి విచారణ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా కారణంగా నిరుడు మార్చి నుంచి విచారణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతోంది. కరోనా వ్యాధి దాదాపు పూర్తిగా తగ్గుముఖం పట్టినందున ముఖాముఖి విచారణ చేపట్టదలచింది. మార్గదర్శకాలనూ విడుదల చేసింది. మంగళవారం, బుధవారం, గురువారం జరిగే సాధారణ, తుది విచారణలను మార్చి 15 నుంచి ప్రయోగాత్మకంగా ముఖాముఖి చేపట్టనుంది. కోర్టు హాల్లో పరిమిత సంఖ్యలో జనాన్ని అనుమతిస్తారు. ఇది సురక్షితమని భావిస్తే దశల వారీగా మిగిలిన రోజుల్లో కూడా ముఖాముఖి విచారణలు చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది.