‘కొనడానికి వాడెవడు, అమ్మడానికి వీడెవడు ’

‘కొనడానికి వాడెవడు, అమ్మడానికి వీడెవడు ’

విజయవాడ : ‘కొనడానికి వాడెవడు, అమ్మడానికి వీడెవడు’ అనే నినాదాలతో శుక్రవారం లెనిన్సెంటర్ మార్మోగింది. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ, కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సిపిఐ జాతీయ నాయకులు నారాయణ, టిడిపి మాజీ మంత్రి నెట్టెం రఘురాం, ఇతర ట్రేడ్ యూనియన్లు సిఐటియు, ఇతర నాయకులు ప్రసంగించారు. ‘విశాఖ ఉక్కు అమ్మేహక్కు కేంద్రానికి లేదు. ఎన్నో త్యాగాల పునాదిపై విశాఖ ఉక్కు నిలబడి ఉంది. దాన్ని ప్రయివేటీకరించడమంటే రైతులను చులకన చేయడమే. జనసేన, టిడిపి, వైసిపిలు కేంద్ర విధానాలను బలపర్చేవే. కానీ మద్దతుగా నిరసనల్లో పాల్గనడం స్ఫూర్తిదాయకం, భవిష్యత్తు ఉద్యమాల్లోనూ ఇలాగే కలిసి రావాల’ని మధు కోరారు. సిపిఐ జాతీయ నాయకులు నారాయణ మాట్లాడారు. ‘కేంద్రం మెడలు వంచైనా విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఈ బంద్ ఉద్యమానికి ఆరంభమే. బిజెపి నేతలు రాష్ట్ర ప్రజలను ఏం సమాధానం చెబుతారు? అని నారాయణ ప్రశ్నించారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని టిడిపి మాజీ మంత్రి నెట్టెం రఘురాం డిమాండ్ చేశారు. లేదంటే ప్రజావ్యతిరేకత కూడ గట్టుకోవల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం బీసెంట్రోడ్డు వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగానూ, రాష్ట్రబంద్కు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ నాయకులు సంఘీభావం తెలిపారు. కేంద్రం విధానాలను విమర్శించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos