తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఏ పని చేసినా రొటీన్ కి కాస్త భిన్నంగా చేస్తారు. రాజకీయంగా తాను సంచలనం చేయాలని అనుకోక పోయినా అనుకోకుండా ఆయన చర్యలు సంచలనంగా మారిపోతుంటాయి. గతంలో ఢిల్లీ లో పర్యటనలు, ఏపి గురించి తాను చేసిన వ్యాఖ్యలు, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు గిఫ్ట్ గురించి యథాలాంపంగా చేసిన వ్యాఖ్యలు, తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఏపి ముఖ్యమంత్రిపై చేసిన చేసిన ఆరోపణలు అన్నీ రాజకీయాల్లో ఎత్తుగడలు ఐనప్పటికి అవి ఎంతగానో సంచలనంగా మారాయి. తాజాగా వచ్చే నెల 14న అంటే ఖచ్చితంగా ప్రేమికుల రోజున తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఏపి పర్యటన ఖరారు కావడం ఉత్సుకతను రేకెత్తిస్తోంది. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ పేరుతో ఆసక్తికర చర్చ జరుగుతున్న నేపథ్యంతో ప్రేమికుల రోజున చంద్రశేఖర్ రావు ఎలాంటి సంచలనాలకు తెర తీస్తారో అనే అంశం పై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ సీయం ఏపి పర్యటన ఖరారు..!
వచ్చే నెల 14న విశాఖకు కేసీఆర్..!! ఉత్కంఠకు తెరపడబోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఏపి పర్యటనపై నెలకొన్న సందిగ్దతకు తెరపడబోతోంది. గత కొంత కాలంగా మాటల తూటాలు పేల్చుకున్న ఏపి, తెలంగాణ ముఖ్యమంత్రులు కలుసుకోబోతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ముందస్తు ఎన్నికల్లో చంద్రబాబు తెలంగాణ అదికార గులాబీ పార్టీకి వ్యతిరేంగా ప్రచారం చేసి రాజకీయంగా దూరాన్ని పెంచుకున్నారు. సామరస్యంగా ఉండాల్సిన రెండు తెలుగు రాష్ట్రాల మద్య రాజకీయ వైరుద్యం నెలకొంది. రాజకీయంగా నీఅంతు చూస్తామని ఒకరంటుంటే, నీఅంతే చూస్తామని మరొకరు కాలు దువ్వే వరకు పరిస్ధితులు వెళ్లాయి.
కేసీఆర్ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ..!!
తెలంగాణ ఎన్నికల్లో జోక్యం చేసుకున్న చంద్రబాబుకు ప్రతిచర్యగా తాను కూడా ఏపి ఎన్నికల్లో జోక్యం చేసుకుంటానని ప్రకటించి రాజకీయ దేమారాన్ని లేపారు చంద్రశేకర్ రావు. దీంతో కొన్న రోజులుగా ఇరు రాష్ట్రాల మద్య ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత ఫెడరల్ ఫ్రంట్ పేరుతో దేశ వ్యాప్తంగా పర్యటించి, జాతీయ నేతలతో సంప్రదింపులు జరిపిన చంద్రశేకర్ రావు చివరికి ఏం జరిగిందో తెలియదు కాని ప్రగతి భవన్ లో మీడియా సమావేశం నిర్వహించి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసారు. దీంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంతులే కాకుండా మంత్రులు సైతం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. రెండు రాష్ట్రాలకు చెందిన మంత్రులు పరస్పరం చూసుకుందాం అంటే చూసుకుందాం అనే స్థాయికి వెళ్లాయి రాజకీయాలు. ఇంతటి వాడి వేడి పరిణామాల నేపథ్యంలో చంద్రశేఖర్ రావు ఏపి పర్యటన అందులోనూ ప్రేమికుల రోజున వెళ్లడం మరింత ఆసక్తి రేపుతోంది.