చెన్నై: పాఠశాల విద్యార్థులకు తీపి కబురు. 9,10,11 తరగతుల విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి గురువారం విధానసభలో ప్రకటించారు. కరోనా కారణంగా ఎలాంటి పరీక్షలు లేకుండానే విద్యార్థులను ఉత్తీర్ణుల్ని చేసినట్లు వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ కాలాన్ని 60 ఏళ్లు పొడిగించినట్లూ తెలిపారు.