న్యూ ఢిల్లీ: అక్షరాస్యతలో కేరళ అరుదైన ఘనత సాధించింది. కేవలం నాలుగేళ్లలో సుమారు లక్ష మందికిపైగా నిరక్షరాస్యులను అక్షరా స్యులుగా తీర్చిదిద్దింది. కేరళ స్టేట్ లిటరసీ మిషన్ అథారిటీ (కేఎస్ఎల్ఎంఏ) అమలు చేసిన వివిధ కార్యక్రమాల ద్వారా మొత్తం 1,08,057 మంది అక్షరాస్యు లయ్యారు. వీరిలో ఎక్కువ మంది అట్టడుగు స్థాయి వర్గాల వారే కావడం విశేషం. 2016-20 మధ్యకాలంలో సాధించిన ఈ ఘనత దక్షిణాదిలో గత 30ఏళ్లలో ఇదే అత్యధికం. అక్షరాస్యత పొందినవారిలో పెద్దసంఖ్యలో మత్స్యకారులు, ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి స్థిరపడిన కార్మికుల కుటుంబీకులే ఉన్నారని అధికారులు తెలిపారు.