కౌన్సిలర్ గా నిలబడుతున్నా

కౌన్సిలర్ గా నిలబడుతున్నా

తాడిపత్రి: మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘రాబోయే ఐదేళ్ల పాటు నాకు ఇంకే పదవి వద్దు. ఐదేళ్లలో ఐదుగురు చైర్మన్లు అవుతారు, ఐదుగురు వైస్ చైర్మన్లు అవుతారు. నేను మాత్రం కౌన్సిలర్ గానే ఉంటా . నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మున్సిపల్ సమావేశాల్లో ఎన్నడూ వేదిక ఎక్కలేదు. ఇప్పుడు కూడా వేదిక కిందే కౌన్సిలరుగా ఉంటా. నాకు 68 ఏళ్లు. ఏ కోరికలే లేవు. ప్రజాసేవే నాకు ము ఖ్యం. ఇంతకు ముందు కూడా చేసి చూపించా. ప్రజలు నా వైపే ఉన్నారు. పురపాలక ఎన్నికల్లో గెలవబోతున్నాం. ఇప్పటికే మా వాళ్లు పంచాయతీ ఎన్నికల్లో సత్తా చూపించారు. నేను తాడిపత్రిలో పుట్టినందుకు ఇక్కడి ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాన’ని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos