అగర్తల : ‘బీజేపీ విదేశాల్లో కూడా అధికారంలోకి వస్తుంది. ఇందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తగిన వ్యూహ రచన చేస్తున్నార’ని ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ ప్రకటించారు. ఇక్కడ జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. ‘అమిత్ షా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ఒకసారి మన రాష్ట్రానికి అతిథిగా వచ్చారు. ఆ సమయంలో మనలో ఒకరు.. నాకు తెలిసి అజయ్ జమ్వాల్(ఈశాన్య జోనల్ బీజేపీ సెక్రటరీ) అనుకుంటా అమిత్ షాతో ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అందుకు అభినందనలు తెలుపుతున్నాన’న్నారు. అందుకు అమిత్ షా.. ‘‘శ్రీలంక, నేపాల్ మిగిలి ఉన్నాయి. పార్టీని అక్కడ కూడా విస్తరించి. బీజేపీని అధికారంలోకి తీసుకురావాలన్నార’ని పేర్కొన్నారు. వింత వింత వ్యాఖ్యలు చేయడంలో విప్లవ్ దేవ్ ముందు వరుసలో ఉంటారు. మూడేళ్ల కిందట దేశంలో ఇంటర్నెట్ వినియోగం మహాభారత కాలం నుంచే ఉందన్నారు. సంజయుడు యుద్ధ భూమిని సందర్శించకుండానే.. అక్కడ ఏం జరుగుతుందనే వివరాల్ని ధృతరాష్ట్రుడికి వివరించాడని.. ఇదంతా ఇంటర్నెట్ వల్లనే అని.. వివరించి నగుబాట్ల పాలయ్యారు.