అమరావతి: ఆంధ్రప్రదేశ్ రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా అధికార వైఎస్ఆర్సీపీ దూకుడు కొనసాగిస్తోంది. శనివారం మధ్యాహ్నం 3.30 గంటల వరకూ పోలింగ్ జరగ్గా, నాలుగు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. రెండో దశలో 539 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. దాంతో రెండో విడతలో 2,786 పంచాయతీలు, 20,817 వార్డులకు పోలింగ్ జరిగింది. ఇప్పటివరకూ ఓవరాల్గా వైఎస్సార్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు 534 మంది విజయం సాధించగా, టీడీపీ మద్దతు దారులు 21 చోట్ల గెలుపొందారు. బీజేపీ మద్దతుదారులు 1, ఇతరులు 5 చోట్ల గెలుపొందారు. తొలి ఫలితాల వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీకాకుళం: వైఎస్సార్సీపీ మద్దతు దారులు 41, టీడీపీ మద్దతు దారులు 0, బీజేపీ మద్దతుదారులు 0,ఇతరులు 0
విశాఖ: వైఎస్సార్సీపీ మద్దతు దారులు 22 , టీడీపీ మద్దతు దారులు0, బీజేపీ మద్దతు దారులు0, ఇతరులు 0
తూర్పుగోదావరి: వైఎస్సార్సీపీ మద్దతు దారులు16 , టీడీపీ మద్దతు దారులు1, బీజేపీ మద్దతు దారులు 0, ఇతరులు 0
కృష్ణా: వైఎస్సార్సీపీ మద్దతు దారులు 32 , టీడీపీ మద్దతు దారులు 4, బీజేపీ మద్దతు దారులు 0, ఇతరులు 0
గుంటూరు: వైఎస్సార్సీపీ మద్దతు దారులు 67 , టీడీపీ మద్దతు దారులు 3, బీజేపీ మద్దతు దారులు0, ఇతరులు 0
ప్రకాశం: వైఎస్సార్సీపీ మద్దతు దారులు 67 ,టీడీపీ మద్దతు దారులు 2, బీజేపీ మద్దతు దారులు0, ఇతరులు 0
నెల్లూరు: వైఎస్సార్సీపీ మద్దతు దారులు 35 , టీడీపీ మద్దతు దారులు0, బీజేపీ మద్దతు దారులు0, ఇతరులు 0
చిత్తూరు: వైఎస్సార్సీపీ మద్దతు దారులు 61 , టీడీపీ మద్దతు దారులు0, బీజేపీ మద్దతు దారులు1 ఇతరులు 0
అనంతపురం:వైఎస్సార్సీపీ మద్దతు దారులు 14 , టీడీపీ మద్దతు దారులు 1, బీజేపీ మద్దతు దారులు 0, ఇతరులు 0
కర్నూలు: వైఎస్సార్సీపీ మద్దతు దారులు 51 , టీడీపీ మద్దతు దారులు 6, బీజేపీ మద్దతు దారులు0, ఇతరులు 0
కడప: వైఎస్సార్సీపీ మద్దతు దారులు 36 , టీడీపీ మద్దతు దారులు 2, బీజేపీ మద్దతు దారులు 0, ఇతరులు 2
పశ్చిమగోదావరి: వైఎస్సార్సీపీ మద్దతు దారులు 15 , టీడీపీ మద్దతు దారులు0, బీజేపీ మద్దతుదారులు0 ,ఇతరులు 0
విజయనగరం:వైఎస్సార్సీపీ మద్దతు దారులు 65 , టీడీపీ మద్దతు దారులు 2, బీజేపీ మద్దతుదారులు 0,ఇతరులు 3