రెండో విడత పంచాయతీ…కొనసాగుతున్న కౌంటింగ్

రెండో విడత పంచాయతీ…కొనసాగుతున్న కౌంటింగ్

అమరావతి : ఎపిలో పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి 18 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 167 మండలాల్లో శనివారం పోలింగ్ జరిగింది. 2,786 సర్పంచ్ స్థానాలు, 20,817 వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. మధ్యాహ్నం 02.30 గంటల వరకు 76.11 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. రెండో విడతలో 3,328 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఎస్ఇసి నోటిఫికేషన్ జారీ చేయగా.. 539 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. నెల్లూరు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లోని ఒక్కో గ్రామ పంచాయతీలలో సర్పంచి పదవులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో మిగిలిన 2,786 చోట్ల సర్పంచి పదవులకు పోలింగ్ నిర్వహించారు. పలుచోట్ల టిడిపి, వైసిపి వర్గీయుల మధ్య అక్కడక్కడా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగింది. మొదటి దశలో మాదిరిగానే రెండో దశలోనూ ఓటు వేసేందుకు పోటెత్తారు. కాగా, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో మధ్యాహ్నం 1.30 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. కరోనా బాధితులకు పోలింగ్ చివరిలో గంట పాటు కరోనా జాగ్రత్తలతో ఓటు వేసేందుకు అనుమతించారు., సాయంత్రం నాలుగు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బ్యాలెట్ బాక్సులను నిర్దేశిత ప్రాంతానికి తరలించి తొలుత వార్డులకు, తర్వాత సర్పంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇవాళ రాత్రి వరకూ ఫలితాలు తేలకపోతే రేపు ఉదయం ప్రకటించే అవకాశం ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos