‘మీది విభజించి పాలించు సిద్ధాతం’

న్యూ ఢిల్లీ : ఎఫ్డీఐ (ఫారెన్ డిస్ట్రక్టివ్ ఐడియాలజీ) అనే కొత్త వర్గం దేశంలో పుట్టుకొచ్చిందంటూ ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ మంగళ వారం గట్టి బదులిచ్చారు. బీజేపీ ప్రభుత్వం బ్రిటిష్ వారు అనుసరించిన ‘విభజించి పాలించే’ విధానాన్ని తు.చ. తప్పకుండా అమలు చేస్తోందని హేళన చేసారు. ‘మోదీజీ…మీరు ఎఫ్డీఐ అంటే ఫారెన్ డిస్ట్రక్టివ్ ఐడియాలజీ అంటూ నిర్వచించారు. కొంత మేరకు మీతో నేను ఏకీభవిస్తున్నాను. విభజించి పాలించే సిద్ధాంతాన్ని బ్రిటిష్ వాళ్లు మనకు వదిలి వెళ్లారు. దేశంలో మతం పేరుతో మీరు ఇదే పాలన అమలు చేస్తున్నారు. ఐక్యతే ఈ దేశానికి ఉన్న శక్తి’ అని దిగ్విజయ్ ఒక ట్వీట్లో పేర్కొ న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos