అడ్డంకులు కాదు వంతెనలు కట్టండి

న్యూఢిల్లీ: రైతు నిరసన ఉదృతంగా కొనసాగుతున్న ప్రదేశాల్లో కాంక్రీటుతో భారీకేడ్లు నిర్మించడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహించారు. ‘ బారికేడ్లు కాదు వారధులు నిర్మించండ’ని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఓవైపు రైతుల నిరసన, మరోవైపు పోలీసుల బందోబస్తుతో ఢిల్లీ సరిహద్దులు కోటలుగా మారుతున్నాయి. ప్రధాన రహదార్లపై ఆరు-ఏడు అంచెల బారీకేడ్లు వేస్తున్నారు. ప్రభుత్వ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ వీటినేవీ అధికారంలో ఉన్నవారు పట్టించుకోవడం లేదు. ఢిల్లీ సరిహద్దులో పోలీసుల ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతున్న కాంక్రీట్ భారీకేడ్ల చిత్రాలను తన ట్విట్టర్ ఖాతాలో జత చేసిన రాహుల్ గాంధీ ‘‘వారధులు నిర్మించండి, గోడలు కాదు’’ అని హితవు పలికారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos