న్యూఢిల్లీ: రైతు ఆందోళనల సెగ మంగళవారం రాజ్యసభను తాకింది. సభ ప్రారంభమైనప్పటి నుంచి పలుమార్లు సభ వాయిదా పడింది. డుతూ వచ్చింది. తొలుత 10.30 గంటల వరకూ, ఆ తర్వాత 11.30 గంటలకు, తిరిగి 12.30 వరకూ సభను చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు వాయిదా వేశారు. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కాగానే సాగు చట్టాలకు సంబంధించి రైతు ఆందోళనలపై చర్చ జరపాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. దీన్ని చైర్మన్ తోసిపుచ్చారు. బుధవారం ప్రారంభిద్దామని చెప్పారు. తమ నోటీసులను తిరస్కరించినందుకు నిరసనగా సభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. దీంతో సభను తొలుత 10.30 గంటల వరకూ వాయిదా వేసిన చైర్మన్, ఆ తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో 11.30 గంటల వరకూ వాయిదా వేశారు. మళ్లీ ఇదే ఆందోళనలు పునరావృతం కావడంతో సభా కార్యక్రమాలు మధ్యాహ్నం 12.30 వరకూ వాయిదా పడ్డాయి. సభా కార్యక్రమాలను సస్పెండ్ చేసి, రైతు ఆందోళనలపై చర్చ జరపాలంటూ 267 నిబంధన కింద పలువురు విపక్ష నేతలు నోటీసులు ఇచ్చారు.