జూన్‌లో టెన్త్ పరీక్షలు

విజయవాడ: ఎపిలో పదోతరగతి పరీక్షలపై విద్యాశాఖ ప్రాథమిక నిర్ణయం తీసుకుంది. జూన్ 7 నుండి 14వ తేదీ వరకూ పబ్లిక్ పరీక్షలను నిర్వహించాలని షెడ్యూల్ను రూపొందించింది. ఉదయం 9.35గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అలాగే పేపర్లను కూడా కుదించనుంది. సైన్సుకు మాత్రం రెండు పేపర్లు ఉంచి, మిగిలిన 5 సబ్జెక్టులకు 5 పేపర్లుంటాయి. జూన్ 17 నుండి జూన్ 26 వరకు స్పాట్ వాల్యుయేషన్ నిర్వహించి.. జూలై 5న ఫలితాలు విడుదల చేయాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. స్కూళ్ల ప్రారంభం మళ్లీ వాయిదా పడడంతో ఈ విద్యాసంవత్సరంలో 166 రోజుల పాటు మే 31 వరకూ తరగతులు జరగనున్నాయి.
పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ ఇలా ఉండనుంది
జూన్ 7- మొదటిభాష, కాంపోజిట్
జూన్ -8 రెండో భాష
జూన్ 9- మూడోభాష(ఆంగ్లం)
జూన్ -10 గణితం
జూన్ 11- భౌతికశాస్త్రం
జూన్ 12- జీవశాస్త్రం
జూన్ 14- సాంఘికశాస్త్రం.
ఇంటర్ ప్రాక్టికల్స్‌లో 30శాతం సిలబస్ తగ్గింపు
మరోవైపు ఈ ఏడాది ఇంటర్ ప్రాక్టికల్స్‌కు సంబంధించిన సిలబస్ను 30 శాతం తగ్గిస్తున్నట్లు రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రకటించింది. పూర్తి సమాచారాన్ని అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచినట్లు పేర్కొంది

తాజా సమాచారం

Latest Posts

Featured Videos