రైతులపై `స్థానిక’ దాడి

రైతులపై `స్థానిక’ దాడి

న్యూఢిల్లీ: ఢిల్లీ-ఛండీగఢ్ మార్గంలోని సింఘూ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన రైతులపై అల్లరి మూకలు రాళ్లు విసిరాయి. స్థానిక పోలీసులు వారిని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇంతలో పరిస్థితులు విషమించడంతో పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ చేశారు. ప్రస్తుతం సింఘూ సరిహద్దులో పరిస్థితులు అదుపులో ఉన్నట్లు కనిపించడం లేదు. రాళ్ల దాడిలో గాయపడ్డవారిని పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రైతు సంఘాల నేతలు రైతులను సద్దు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ పరిస్థితితులు విషమించొచ్చనే అనుమానాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు రైతులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తుండగా, మరోవైపు నిరసన ఆపేయాలంటూ రైతులు నిరసన చేస్తున్న ప్రదేశానికి వచ్చి స్థానికులు నినాదాలు చేశారు. వీరి మధ్య పోలీసులు ఇరు వర్గాలను అదుపులో ఉంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో సింఘూ సరిహద్దులో పరిస్థితులు తీవ్ర స్థాయికి చేరాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos