ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్ని గడించాయి. వ్యాపారం మొదలు నుంచి కడ వరకూ లాభాలు కొనసాగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 689 పాయింట్లు పెరిగి 48,783 వద్ద, నిఫ్టీ 209 పాయింట్లు లాభపడి 14,347 వద్ద ఆగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో మారుతి సుజుకి (5.86%), టెక్ మహీంద్రా (5.25%), ఇన్ఫోసిస్ (3.97%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (3.45%), అల్ట్రాటెక్ సిమెంట్ (3.40%) లాభాల్ని గడించాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.59%), భారతి ఎయిర్ టెల్ (-0.93%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.45%), ఐటీసీ (-0.30%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-0.26%) నష్టపోయాయి.