హైదరాబాదు : నటుడు రవితేజ దర్శకత్వంలో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో దర్వకత్వ శాఖలో పని చేసిన తను నటుడుగా ఉన్నత శిఖరాలకు చేరారు. ఇప్పుడు దర్శకత్వంపై మనసు పడ్డారు. రవితేజ దర్శకత్వం చేసే అవకాశం ఉందా?ని శుక్రవారం టీవీ ఛానల్ అడిగిన ప్రశ్నకు సానుకూలంగా స్పందించారు. ‘ఉన్నాయ్… అవకాశాలున్నాయ్.. చూద్దాం’ అని రవితేజ అన్నారు. క్రాక్ సినిమా శనివారం విడుదల కానున్న సందర్భంగా టీవీ ముఖాముఖిలొ పాల్గొన్నారు.