చామరాజ నగర: తమిళనాడు తిరుపురలోని టెంపో ట్రావెలర్స్‌కు చెందిన మినీ బస్సు. శుక్రవారం తెల్లవారుజామున సువర్ణవర్తి రిజర్వాయర్ దగ్గర బోల్తా పడింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో 14మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో నలుగురు చిన్నారులున్నారు. క్షతగాత్రులను చామ రాజ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. దంపతులు సుబ్రమణ్యం(65)- అమరావతి(55), వారి కుమార్తె మరణించారు. కుటుంబమంతా మైసూరు చాముండీ అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వివరించారు