వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు తన ఓటమిని అంగీకరించారు. జో బెడెన్దే గెలుపని అమెరికా కాంగ్రెస్ ప్రకటించిన కొన్ని నిమిషాలకు ఈ కీలక వ్యాఖ్య చేశారు.‘ ‘ఎన్నికల ఫలితాలను నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. వాస్తవాలు కూడా నన్నే సమర్థిస్తున్నాయి. జనవరి 20న నిబంధనల ప్రకారం అధికార మార్పిడి జరుగుతుంది. అమెరికా చరిత్రలోనే మహాద్భుత పాలనకు దీంతో ముగింపు పడినట్టైంది. అయితే. గొప్ప దేశాన్ని సాకారం చేసేందుకు మేం చేస్తున్న పోరాటానికి మాత్రం ఇది ఆరంభం’ అని ప్రకటించారు.