హైదరాబాదు: సినీ నటి, హీరో రాజశేఖర్ భార్య జీవిత మంగళవారం ఇక్కడ తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో కమలం పార్టీలో చేరారు. 2019 ఎన్నికలపుడు వైఎస్ జగన్ సమక్షంలో జీవిత, రాజశేఖర్ దంపతులు వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్లో చేరిన వీరుఅనంతరం బీజేపీలో చేరారు. ఆ తర్వాత మళ్లీ వైఎస్సార్సీపీ గూటికి చేరారు. కొన్నాళ్లకే టీడీపీకి జైకొట్టారు.