హైదరాబాద్ :తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సమితి అధ్యక్షులుగా, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు రాజకీయ వర్గాల ద్వారా తెలిసింది. సీనియర్ నేతగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా పార్టీకి ఎంతోకాలంగా సేవలందిస్తున్న జీవన్‌రెడ్డికి పట్టం కట్టాలని పార్టీ పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. ఏడు సార్లు (జగిత్యాల) ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్‌రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్చేతిలో ఓటమి పొందారు. అనంతరం జరిగిన పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. అనుభవజ్ఞుడైన నేతగా, మృదుస్వభావి మంచి పేరుంది. అందరితో కలుపుకునిపోయే తత్వంగల నేతకావడంతో పీసీసీ పదవికి ఆయన్ని నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో చావుదెబ్బ తిన్న టీడీపీలో కీలక నేతగా గుర్తింపు పొందిన రేవంత్‌రెడ్డి అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి గెలిచారు. పార్టీ పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆయనకు నిరాశ మిగలనుంది.