న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన సెంట్రల్ విస్టా రీడవలప్మెంట్ కట్టడాలకు ప్రాజెక్టుకు నిర్మాణానికి సుప్రీంకోర్టు మంగళవారం అనుమతించింది. పర్యావరణ అనుమతులు, కట్టడాల విన్యాసాలపై కేంద్రం వాదనలతో న్యాయమూర్తులు ఏఎం ఖాన్విల్కర్, దినేశ్ మహేశ్వరి, సంజీవ్ కన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఏకీభవించింది. నిర్మాణ పనుల ప్రారంభానికి హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ అనుమతి తప్పని సరని తెలిపింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం నిరుడు రిజర్వ్ చేసిన తీర్పును ఈ రోజు ప్రకటించింది. డీడీఏ చట్టం కింద అధికారాల వినియోగం చెల్లుబాటవుతుందని తెలిపింది.