న్యూ ఢిల్లీ : కొత్త సాగు చట్టాల్ని రద్దు చేయక పోతే గణతంత్ర దినోత్సవాన ఢిల్లీ వైపు కిసాన్ పరేడ్ పేరిట ట్రాక్టర్ల ర్యాలీలు నిర్వహిస్తామని రైతులు హెచ్చరించారు.శని వారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. రాజ్‌పథ్‌లో రిపబ్లిక్ డే పరేడ్ ముగిసిన వెంటనే తమ ర్యాలీ ప్రారంభమవుతుందని తెలిపారు. డిమాండ్లు తీరేంత వరకూ ఢిల్లీ సరిహద్దుల్లోనే ఆందోళన కొనసాగిస్తామని తెగేసి చెప్పారు. ఇప్పటి వరకు తాము ప్రశాంతంగా నిరసన ప్రదర్శనలు కొనసాగించాం. ఇకపైనా శాంతియుతంగా ఆందోళన చేస్తామని కుండ బద్దలు కొట్టాయి. 23న ప్రతి రాష్ట్రంలోనూ గవర్నర్ల నివాసాల వైపు ర్యాలీ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ ఆందోళనలో 50 మంది రైతులు అమరులయ్యారని మరో నేత అశోక్ ధవాలే ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటి వరకు 50 శాతం డిమాండ్లను అంగీకరించిందని వస్తున్న వార్తలు పూర్తి అవాస్తమని స్వరాజ్ ఇండియా అధిపతి యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు రాతపూర్వకంగా ప్రభుత్వం నుంచి ఒక్క హామీ కూడా లభించలేదన్నారు. మద్ధతు ధరపై దేశ ప్రజలను కేంద్రం తప్పుదోవ పట్టిస్తోందని రైతు నేత గుర్నామ్ సింగ్ చౌదునీ విమర్శించారు. ’23 రకాల పంటలను కనీస మద్దతు దరకు కొనుగోలు చేస్తారా? అని గత సమావేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. దానికి వ్యతిరేకంగా బదులిచ్చారన్నారు. ఆందోళన 38వ రోజుకి చేరింది.