కమలం రాజకీయ చదరంగంలో పావులైన బాబు, జగన్‌

కమలం రాజకీయ చదరంగంలో పావులైన బాబు, జగన్‌

విజయవాడ: ప్రజా సమస్యల పరిష్కారానికి పాటు పడాల్సిన రాజకీయ పక్షాలు దేవుళ్ల చుట్టూ తిరుగుతున్నాయని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ సమన్వయ సమితి సభ్యులు సుంకర పద్మశ్రీ వ్యాఖ్యానించారు. శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘భాజపా ఆడుతున్న దేవుడి ఆటలో వైకాపా, తెదేపా పావులుగా మారాయి. దేవాలయాలపై జరుగుతున్న దాడులను అందరూ ఖండించాల్సిందే. ఆ మూడు రాజకీయ పక్షాలూ దేవుణ్నీ ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. దాదాపు 150 దేవాలయాలపై దాడులు జరి గితే ప్రభుత్వం ఏం చేస్తోంది? ఆలయాలపై భాజపాయే దాడులు చేయించి కావాలనే నాటకం ఆడుతుందనే అనుమానం కలుగుతోంది. రాజకీయ ఆధిపత్యం కోసం వైకా పా, తెదేపా దిగజారి ప్రవర్తిస్తున్నాయి. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వారిని పట్టించుకోకుండా దేవాలయల రాజకీయం చేయడం ఏమిటి? బీజేపీ ఆడుతున్న నాటకంలో జగ న్, చంద్రబాబు పాత్రధారులై జనాన్ని మోసం చేస్తురన్నారు. మతాన్ని అడ్డుపెట్టుకుని బలం పెంచుకోవాలని బీజేపీ కుటీల రాజకీయాలు చేస్తుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos