చెన్నై: తమిళ నటుడు అరుణ్ అలెగ్జాండర్(48) గుండెపోటుతో సోమవారం రాత్రి ప్రాణాలు వదిలారు. బిగిల్, ఖైదీ, కొలమావు కోకిల తదితర చిత్రాల్లో నటించారు. డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకూ పరిచితుడు. ఆయన చివరి చిత్రం మాస్టర్. వచ్చే జనవరిలో ఇది విడుదల కానుంది. ‘అరుణ్ మరణం కలచి వేసింది. ఇంత త్వరగా వెళ్లిపోతావని ఊహించలేదు. ఈ బాధ తీరనిది. అరుణ్ ఎప్పటికీ నా గుండెల్లో ఉంటాడ’ని దర్శకుడు కనగరాజ్ అన్నారు.