‘అన్నదాతకు మద్దతుగా కొత్త సంవత్సర వేడుకల్లో ప్రమాణం చేయండి’

న్యూ ఢిల్లీ: అన్నదాతకు మద్దతుగా ఉంటామని కొత్త సంవత్సర వేడుకల్లో ప్రమాణం చేయాలని ప్రజలకు రైతు సంఘాలు మంగళవారం ఇక్కడ పిలుపు నిచ్చాయి. బుధవారం కేంద్రం , రైతు సంఘాల మధ్య మరో దపా చర్చలు జరగనున్న సందర్భంగా సింఘు సరిహద్దు నుంచి రైతులు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు చర్చలు జరగనున్నాయి. తాము ప్రతిపాదించిన అంశాలపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదని రైతు సంఘాలు విమర్శించాయి. అయినా చర్చలకు హాజరై సాగు చట్టాల రద్దుపైనే మాట్లాడతామని తేల్చి చెప్పాయి. తీవ్రమైన చలిలోనూ ఎలాంటి అలుపు లేకుండా చేస్తోన్న రైతుల నిరసనలు మంగళ వారం 34వ రోజుకి చేరాయి. సింఘు, టిక్రీ, గాజీపూర్, చిల్లా సహా పలు చోట్ల అన్నదాతలు బైఠాయించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos